News July 1, 2024

నేటి నుంచి స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

AP: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఇవాళ్టి నుంచి స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. నూజివీడులో ఈ నెల ఆరో తేదీ వరకు పరిశీలన కొనసాగనుంది. సైనిక సంతతి కోటాలో 2,582, స్పోర్ట్స్ కోటాలో 1,830, దివ్యాంగుల కోటాలో 332, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 270 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఉ.9 గంటలకే రిపోర్టు చేయాలి.

Similar News

News September 21, 2024

మణిపుర్: పోలీసులకు దొరికిన రాకెట్ హెడ్స్, షెల్స్, మోర్టార్లు

image

మణిపుర్‌లో పోలీసుల సోదాల్లో అధునాతన ఆయుధాలు, పేలుడు సామగ్రి దొరకడం కలకలం రేపుతోంది. చురాచాంద్‌పుర్ జిల్లాలోని సములామ్లన్‌లో పోలీసులు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇంప్రూవైజ్డ్ రాకెట్ షెల్, వేర్వేరు సైజుల్లో 3 లైవ్ రాకెట్ హెడ్ అమ్యూనిషన్, 3 ఇంప్రూవైజ్డ్ మోర్టార్లు, యాంటీ రియోట్ స్టన్ షెల్స్, స్టన్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి 900 <<14154680>>కుకీ మిలిటెంట్ల<<>> చొరబాటు గురించి తెలిసిందే.

News September 21, 2024

విమర్శలను సహించడమే ప్రజాస్వామ్యానికి పరీక్ష: గడ్కరీ

image

వ్యతిరేక అభిప్రాయాలను సహిస్తూ, అవి పాలకుడిలో అంతర్మథనానికి దారితీయడమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్షని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రచయితలు, మేధావులు నిర్భయంగా అభిప్రాయాలు చెప్పాలన్నారు. ‘దేశంలో భిన్నాభిప్రాయాలపై ఇబ్బంది లేదు. అభిప్రాయాలు లేకపోవడమే అసలు సమస్య. మేం రైటిస్టులమో లెఫ్టిస్టులమో కాదు. మేం ఆపర్చునిస్టులం. అంటరానితనం, ఆధిపత్యం, చిన్నతనం ఉన్నన్నాళ్లూ జాతి నిర్మాణం జరగద’ని అన్నారు.

News September 21, 2024

మరో 2 గంటల్లో వర్షం..

image

TG: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. యాప్రాల్, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో 2 గంటల్లో సికింద్రాబాద్, బేగంపేట, కూకట్‌పల్లి సహా సెంట్రల్, ఈస్ట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరి మీ ఏరియాలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.