News November 14, 2024
వర్మాజీ & శర్మాజీ

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్లు తిలక్వర్మ, అభిషేక్శర్మ అదరగొట్టారు. తిలక్ 107(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ 50(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో సూర్య(1), హార్దిక్(18) వంటి సీనియర్లు పెద్దగా రాణించకపోయినా <<14604651>>భారత్<<>> మంచి స్కోర్(219/6) చేసింది. దీంతో ఈ ఇద్దరు యువ బ్యాటర్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News November 6, 2025
ఖతార్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖతార్లో సూపర్వైజర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, టెక్నికల్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెలకు రూ.1,94,000 నుంచి రూ.2,38,000 వరకు చెల్లిస్తారు. వయసు 45ఏళ్ల లోపు ఉండాలి. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
News November 6, 2025
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: టిప్పర్ యజమాని

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.
News November 6, 2025
కరివేపాకుతో మెరిసే చర్మం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.


