News December 13, 2024
బాబోయ్ చలి.. IMD ఆరెంజ్ అలర్ట్

TG: రాష్ట్రంలో చలి విషయంలో ఈ ఏడాది తొలి ఆరెంజ్ అలర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) జారీ చేసింది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధం కావాలని సూచించింది. పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. ‘ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో బాగా ప్రభావం ఉండొచ్చు. ఈ నెల 15 వరకు హైదరాబాద్ మేఘావృతమై ఉంటుంది’ అని పేర్కొంది.
Similar News
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
సెబీలో పెరిగిన పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెబీలో 110పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా 135కు పెంచారు. జనరల్ విభాగంలో 56 పోస్టులకుగాను 77కు, రీసెర్చ్ విభాగంలో 4 ఉండగా.. 8కి పెంచారు. మిగిలిన విభాగాల్లో పోస్టులను పెంచలేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ / PG డిప్లొమా, LLB, BE/B.Tech, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: sebi.gov.in
News November 28, 2025
ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఆయన 845 రోజులుగా నిర్బంధంలోనే ఉండగా.. గత నెల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా ‘డెత్ సెల్’లో వేశారు. ఇమ్రాన్‌ను చంపడం వల్లే ఎవరినీ అనుమతించడం లేదని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని పాక్ ప్రభుత్వం బుకాయిస్తోంది. అలాంటప్పుడు ఆయనను బయటి ప్రపంచానికి చూపించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


