News August 14, 2025

అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. JGL, భూపాలపల్లి, KNR, MHBD, MNCL, ములుగు, NML, NZB, PDPL జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. HYD, ADB, భద్రాద్రి, HNK, MDK, SRCL, WGL, ఖమ్మం, కొమురం భీం, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Similar News

News August 14, 2025

క్లౌడ్ బరస్ట్.. 22 మంది మృతిపై PM మోదీ దిగ్భ్రాంతి

image

J&Kలోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల 22మంది మృతిచెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నట్లు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు అవసరమైన ఏ సాయాన్ని అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు అమిత్ షా సైతం J&K CM ఒమర్ అబ్దుల్లాకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News August 14, 2025

వివేకాకు న్యాయం చేయాలని స్లిప్: కౌంటింగ్‌ వేళ వెలుగుచూసిందన్న TDP

image

AP: పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ‘మా వివేకా సార్‌కి న్యాయం చేయండి సార్’ అని స్లిప్ వచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టే సమయంలో అజ్ఞాత వ్యక్తి వేసిన ఈ కాగితం బయటపడినట్లు పేర్కొంది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు వివరించింది. పులివెందుల ZPTC ఉప ఎన్నికలో TDP అభ్యర్థి లతారెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.

News August 14, 2025

CS పదవీకాలం పొడిగింపు కోసం CM రిక్వెస్ట్!

image

TG: CS రామకృష్ణారావు పదవీకాలం పొడిగింపు కోసం CM రేవంత్ డీవోపీటీకి లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెలాఖరుతో రిటైరవ్వాల్సిన ఆయన్ను మరో 6 నెలలు కొనసాగించాలని కోరినట్లు తెలుస్తోంది. పైగా కొత్త CS నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు చేయట్లేదని సమాచారం. ఈ పోస్ట్ కోసం జయేశ్ రంజన్, శశాంక్ గోయల్, వికాస్ రాజ్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.