News December 7, 2024
ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి: CM రేవంత్

TG: ఏడాది ప్రజాపాలనలో చాలా సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్లో తెలిపారు. ‘ఉద్యమాలను, ఆత్మబలిదానాలను, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023న తెలంగాణ నా చేతుల్లో పెట్టింది. తన వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది. నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నాను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.


