News February 28, 2025
వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News March 1, 2025
అదరగొడుతున్న మాజీలు.. మాస్టర్స్ లీగ్లో మరో సెంచరీ

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మాజీలు అదరగొడుతున్నారు. మొన్న ఆస్ట్రేలియా ప్లేయర్ వాట్సన్ సెంచరీతో చెలరేగగా ఇవాళ శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ శతకం బాదారు. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో అతడు 53 బంతుల్లోనే 102 రన్స్తో చెలరేగారు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో లంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 217 రన్స్ చేయగా శ్రీలంక మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
News March 1, 2025
నమాజ్ వేళలు.. మార్చి 1, శనివారం

ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 1, 2025
శుభ ముహూర్తం (01-03-2025)

☛ తిథి: శుక్ల పాడ్యమి, తె.5.30 వరకు
☛ నక్షత్రం: పూర్వాభాద్ర, మ.1.46 వరకు
☛ శుభ సమయం: సా.4.45 నుంచి 5.33 వరకు
☛ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-నుంచి 7.36 వరకు
☛ వర్జ్యం: రా.10.46 నుంచి 12.16 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.6.38 గంటల నుంచి 8.08 వరకు