News November 6, 2024
ఎల్లుండి ఓటీటీలోకి ‘వేట్టయన్’
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 8 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.
Similar News
News November 6, 2024
రైల్వే లైన్ల సర్వే కోసం నిధులు
AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది. మచిలీపట్నం-రేపల్లె మధ్య 45.30KM DPR కోసం ₹1.13 కోట్లు, బాపట్ల-రేపల్లె మధ్య 45.81KM మేర DPRకై రూ.1.15 కోట్లు విడుదలయ్యాయి. ఈ 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే చెన్నై-హౌరా వెళ్లే రైళ్లు విజయవాడ వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా రాకపోకలు సాగించవచ్చు. విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుంది.
News November 6, 2024
APPLY: భారీ జీతంలో 1500 ఉద్యోగాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. APలో 200, TGలో 200 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్‌లో స్థానిక భాషను చదివి ఉన్నవారు అర్హులు. వయసు OCT 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం రూ.77 వేల వరకు పొందొచ్చు. వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in/
News November 6, 2024
‘ఆవేశం’ మూవీని రీమేక్ చేయనున్న రవితేజ?
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘ఆవేశం’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మాస్ మహారాజా రవితేజ కొనుగోలు చేశారని, దీనిని ఆయన రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. జీతూ మాధవన్ ‘ఆవేశం’ మూవీని తెరకెక్కించగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజై రూ.150కోట్లు వసూలు చేసింది.