News February 25, 2025
సీఎం చంద్రబాబును కలిసిన వీహెచ్

AP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసి.. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
NEPను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత రాజీనామా

తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రగడ మరింతగా ముదురుతోంది. తాజాగా బీజేపీ నేత, నటి రంజనా నాచియార్ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విద్యార్థులపై బలవంతంగా మూడు భాషలను రుద్దడం అనేది చాలా తప్పని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయమని సీఎం స్టాలిన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
News February 25, 2025
నటిపై కేరళ కాంగ్రెస్ ఆరోపణలు.. రియాక్షన్ ఇదే

న్యూఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారని కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నటి ప్రీతి జింటా ఖండించారు. పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకొని తిరిగి చెల్లించినట్లు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తన SM అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దన్నారు. ఓ రాజకీయ పార్టీ ఇలాంటి ప్రచారం చేయడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు.
News February 25, 2025
మద్దతిచ్చినందుకు థాంక్యూ ట్రంప్: వివేక్ రామస్వామి

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికన్ హిందూ, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి థాంక్స్ చెప్పారు. ఓహైయో గవర్నర్ అభ్యర్థిగా ఎండార్స్ చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఓహైయోను మళ్లీ గొప్పగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వివేక్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనెంతో స్పెషల్, యంగ్, స్మార్ట్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే.