News January 5, 2025
హైందవ శంఖారావంలో VHP డిక్లరేషన్

AP: విజయవాడలో జరుగుతోన్న హైందవ శంఖారావంలో విశ్వహిందూ పరిషత్ (VHP) డిక్లరేషన్ ప్రకటించింది.
*ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్టసవరణ చేయాలి.
*ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి.
*హిందూ ధర్మం పాటించేవాళ్లనే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి
*దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు.
*వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు సరికాదు.
Similar News
News December 1, 2025
కడప: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
News December 1, 2025
మహాభారతంలో భాగమే భగవద్గీత

వ్యాసుడు రచించిన మహాభారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలామందికి తిలిసే ఉంటుంది. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.
News December 1, 2025
750పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://pnb.bank.in/


