News December 28, 2025

VHTలో ఆడనున్న శ్రేయస్ అయ్యర్!

image

గాయం కారణంగా టీమ్‌కు దూరమైన వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అతను పూర్తిగా కోలుకున్నట్లు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లోని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ముంబై తరఫున జనవరి 3, 6న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటారని, తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని సమాచారం. OCT 25న AUSతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే.

Similar News

News December 29, 2025

31న సమ్మె.. టైమ్ చూసి దెబ్బ!

image

ఏడాది ముగింపు వేళ మరోసారి డెలివరీ వర్కర్లు(గిగ్) <<18690914>>సమ్మెకు<<>> సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో పార్టీ మూడ్‌లో ఉండే ప్రజలకు ఫుడ్, గిఫ్ట్‌లు ఇతర ఆర్డర్లు అందిస్తూ ఈ వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో 31న సమ్మె చేస్తే తమ డిమాండ్లు నెరవేరుతాయని వారు భావిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రోజున వీరికి డిమాండ్ ఎక్కువే. మెట్రో, టైర్-2 సిటీల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించనుంది.

News December 29, 2025

ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసా?

image

దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి వేళగా చెబుతారు. ఈ మధ్యలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీ సమయంగా పేర్కొంటారు. ఈ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30న వచ్చింది. ఆ రోజు మహా విష్ణువు మూడు కోట్ల దేవతలతో దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.

News December 29, 2025

ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

NDA, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ పరీక్ష ద్వారా UPSC త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ (MPC) ఉత్తీర్ణులు అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: upsc.gov.in/ *మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.