News May 23, 2024

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే వీఐ నిధుల సమీకరణ?

image

కొత్త ప్రభుత్వం ఏర్పాటై పరిస్థితులపై క్లారిటీ వచ్చే వరకు వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని బాకీలను షేర్ల రూపంలో చెల్లించడంపై అప్పటికి స్పష్టత వస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికే షేర్ల విక్రయం ద్వారా వీఐ రూ.20వేల కోట్లు సేకరించింది. లోన్ సహా పలు మార్గాల్లో మరో రూ.35వేల కోట్లు పోగుచేయాలని భావిస్తోంది.

Similar News

News February 14, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* పూరీలు తెల్లగా ఉండాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* ఆలూతో కలిపి నిల్వచేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోవు.

News February 14, 2026

పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోయి..!

image

నలుగురు బాలికలు చేసిన వింత ప్రయోగం వారి ప్రాణాలను బలితీసుకుంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు సరదాగా పొలానికి వెళ్లి పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకొని తాగారు. నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోగా ఒక బాలిక వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించారనే బాధతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

News February 14, 2026

ఆ బౌలర్‌తో జాగ్రత్త.. భారత బ్యాటర్లకు మాజీల సూచన

image

రేపు పాక్‌తో మ్యాచులో సైడ్ ఆర్మ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశముంది. ఆయన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని టీమ్‌ఇండియాకు హర్భజన్ సింగ్ సూచించారు. ఈ మ్యాచులో INDదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తారిఖ్ బాల్‌ను ఆగి వేస్తుండడంతో విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. అతడు అలా ఆగినప్పుడు భారత బ్యాటర్లు పక్కకు తప్పుకోవచ్చని స్పిన్నర్ అశ్విన్ సలహా ఇచ్చారు.