News March 12, 2025

ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్

image

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ AIIMSలో చేరిన ఆయన తాజాగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు.

Similar News

News April 8, 2026

సీజ్‌ఫైర్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!

image

కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు దిగివచ్చింది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఏకంగా 20 డాలర్లు తగ్గి 94.87కు పడిపోయింది. మరోవైపు వరుస నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభపడే అవకాశం ఉంది.

News April 8, 2026

త్వరలోనే పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టుకు ఏజీ రిపోర్ట్!

image

AP: స్థానిక సంస్థలు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. వారం రోజుల్లో SEC నియామకం, 10 రోజుల్లో BC జనాభా లెక్కింపు పూర్తవుతాయన్నారు. BC రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఎన్నికలపై దాఖలైన పిటిషన్ల విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది.

News April 8, 2026

ఒంటికన్ను రాక్షసుడితో మెగాస్టార్ ఫైట్!

image

చిరంజీవి హీరోగా నటిస్తోన్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఆయన ఒంటికన్ను రాక్షసుడితో ఫైట్ చేస్తారని, హాలీవుడ్ స్థాయిలో ఈ పోరాట సన్నివేశాన్ని తీర్చిదిద్దుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీజీ వర్క్ పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్‌కు ఇంకొన్ని నెలలు పట్టే అవకాశముందని సమాచారం. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.