News February 22, 2025
విక్కీ అదరగొడుతున్నాడుగా..

‘ఛావా’ హీరో విక్కీ కౌశల్.. ఈ పేరు ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీల్లోనూ మార్మోగుతోంది. విభిన్న స్క్రిప్ట్ సెలక్షన్స్‌తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. URI, సర్దార్ ఉధమ్, సామ్ బహాదుర్ వంటి చిత్రాలతో ఆయన సత్తా చాటారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే షారుఖ్ ఖాన్ ‘డుంకీ’, రణ్‌బీర్ కపూర్ ‘సంజూ’ చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌తో మెప్పించారు. హీరోయిన్ కత్రినా కైఫ్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
Similar News
News February 22, 2025
కుమారుడితో కలిసి క్రికెట్ ఆడిన ద్రవిడ్

టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కొడుకు అన్వయ్ ద్రవిడ్‌తో కలిసి ఓ క్లబ్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచులో ద్రవిడ్ 8 బంతులాడి 10 పరుగులకే ఔటయ్యారు. కానీ అన్వయ్ మాత్రం హాఫ్ సెంచరీ(58)తో మెరిశారు. కాగా రాహుల్ ఇద్దరు కుమారులు సమిత్, అన్వయ్ క్రికెట్‌లో రాణిస్తున్నారు. సమిత్ కేపీఎల్‌లో కూడా ఆడారు. ప్రస్తుతం కర్ణాటక తరఫున రంజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
News February 22, 2025
మాటలకందని గౌరవమిది: మోదీకి విక్కీ కౌశల్, రష్మిక మందన్న రిప్లై

దేశవ్యాప్తంగా ‘ఛావా’ <<15542065>>గాలి<<>> వీస్తోందన్న PM మోదీకి ఆ చిత్ర నటీనటులు ధన్యవాదాలు తెలియజేశారు. శంభాజీ పాత్రలో వీర, శూర, రౌద్ర రసాలు ఒలికించిన విక్కీ కౌశల్ ‘మాటల్లో వర్ణించలేని గౌరవమిది. నరేంద్ర మోదీజీకి కృతజ్ఞతలు’ అని పోస్ట్ పెట్టారు. యేసుభాయి పాత్రకు ప్రాణం పోసిన రష్మిక మందన్న ‘థాంక్యూ నరేంద్రమోదీ సర్. నిజంగా మాకిది గౌరవం’ అని అన్నారు. ఛావాను అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని డిమాండ్లు రావడం తెలిసిందే.
News February 22, 2025
సెంచరీతో చెలరేగిన డకెట్.. AUS టార్గెట్ ఎంతంటే?

CT-2025లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. 17 ఫోర్లు, 3 సిక్సులతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో CTలో తొలిసారి 150, అత్యధిక వ్యక్తిగత స్కోర్(165) చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించారు. మరో బ్యాటర్ జో రూట్ 68 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ 3, జంపా, లబుషేన్ తలో 2 వికెట్లు తీశారు.