News January 18, 2025

CBIపై బాధితురాలి తండ్రి ఆరోపణలు

image

కోల్‌కతా హత్యాచార ఘటనపై CBI దర్యాప్తు పూర్తిగా చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఇందులో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయ్‌ను మాత్రమే నిందితుడిగా చేర్చారని చెప్పారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా ఆ శాంపిల్ సేకరించలేదన్నారు. అటు కేసు పురోగతిని ఎంత అడిగినా చెప్పలేదన్నారు. నేడు కోర్టుకు తమను పిలవలేదని, తమ లాయర్‌నూ రావద్దని కోరినట్లు తెలిపారు.

Similar News

News December 8, 2025

కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.. అల్లూరిలో 5.3 డిగ్రీలు నమోదు

image

ఏపీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపట్టులో 7.7, డుంబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లి 9.5, హుకుంపేటలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అటు తెలంగాణ HYDలోని HCUలో 9 డిగ్రీలు, BHELలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు పేర్కొన్నారు.

News December 8, 2025

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<>NML<<>>) 5జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48వేల వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News December 8, 2025

‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

image

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.