News November 9, 2024
ఈ నెల 14 నుంచి విజయోత్సవాలు: భట్టి

TG: ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన కావొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 14న రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ వర్సిటీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
Similar News
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 6, 2025
WPL-2026.. రిటైన్ లిస్టు ఇదే..

WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరగనుంది. దీనికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ జాబితా ఇదే..
RCB: స్మృతి మంధాన(3.5Cr), రిచా ఘోష్(2.75Cr), పెర్రీ(2Cr), శ్రేయాంక(60L)
MI: హర్మన్ప్రీత్, బ్రంట్, హేలీ, అమన్జోత్, కమలిని
DC: జెమీమా, షఫాలీ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్
UP వారియర్స్: శ్వేతా సెహ్రావత్
గుజరాత్: ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ
News November 6, 2025
వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

భారత్కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.


