News October 7, 2024
బంగ్లాపై గెలుపు.. టీమ్ ఇండియా రికార్డులు

తొలి T20లో బంగ్లాదేశ్‌పై ఘన <<14290970>>విజయం<<>> సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి జట్లను అత్యధికసార్లు(42) ఆలౌట్ చేసిన టీమ్‌గా పాక్ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఆ తర్వాత కివీస్(40), ఉగాండా(35), విండీస్(32) ఉన్నాయి. అలాగే 120+ పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత వేగంగా(11.5 ఓవర్లు) ఛేజ్ చేసింది. సూర్య సేనకు ఇదే ఫాస్టెస్ట్ ఛేజ్. 2016లో బంగ్లాపైనే 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
Similar News
News November 19, 2025
నేడు పుట్టపర్తికి మోదీ రాక

AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
News November 19, 2025
భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్పాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.
News November 19, 2025
43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


