News April 20, 2025
మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.
Similar News
News April 20, 2025
BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఇక్కడ <
News April 20, 2025
IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 20, 2025
టూత్ పేస్ట్‌లో హానికర సీసం, పాదరసం: లీడ్ సేఫ్ మామా

కొన్ని ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు ‘లీడ్ సేఫ్ మామా’ సంస్థ అధ్యయనంలో తేలింది. 51 పేస్ట్ బ్రాండ్లను పరీక్షించగా వీటిలో చాలా బ్రాండ్లలో సీసం, ఆర్సెనిక్, మెర్క్యురీ, కాడ్మియం వంటి హానికర రసాయనాలు ఉన్నాయి. ఇవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కాగా ఈ బ్రాండ్లన్నీ తమ పేస్టుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నట్లు చెబుతున్నాయి.