News May 26, 2024

VIDEO: అనంత ఎస్పీని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఎస్పీతో చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గానీ, అతని అనుచరులకు గానీ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిపై కేసులు పెట్టవద్దని ఎస్పీని కోరారు. వెంకట్రామిరెడ్డి కేవలం తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు.

Similar News

News January 2, 2026

ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీహ సత్తా

image

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.

News January 2, 2026

శిల్పారామంలో అలరించిన నూతన సంవత్సర వేడుకలు

image

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సాయంత్రం
నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలను నిర్వహించినట్లు పరిపాలనాధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. శిల్పారామానికి వచ్చిన వీక్షకుల్లోని చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చారన్నారు. ఈ వేడుకలో సుమారు 5,000 మంది పాల్గొన్నారన్నారు.

News January 1, 2026

గుంతకల్లులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంతకల్లులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వెళ్తున్న అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.