News July 28, 2024
వీడియో లీక్ చాలా బాధించింది: ఊర్వశీ రౌతేలా

నటి ఊర్వశీ రౌతేలాకి సంబంధించిన ఓ క్లిప్ ఇటీవల నెట్టింట వైరల్ అయింది. ఆమె స్నానాల గదిలో దుస్తులు తొలగిస్తున్నట్లుగా ఉన్న ఆ క్లిప్ వైరల్ కావడంపై ఆమె స్పందించారు. ‘అది నిజమైన వీడియో కాదు. నేను నటిస్తున్న గుస్పేటియా అనే కొత్త సినిమాలో సీన్. విడుదలకు ముందే ఇలాంటి లీకులు రావడం, అది వైరల్ కావడం చాలా బాధ కలిగించింది. ఇలాంటి చేదు అనుభవం ఏ అమ్మాయికీ ఎదురుకాకూడదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 1, 2025
పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.
News December 1, 2025
మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.
News December 1, 2025
దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.


