News September 13, 2024
స్నానాలు చేస్తుండగా వీడియో రికార్డ్ చేసింది: విద్యార్థినులు

TG:సిరిసిల్ల(D) తంగళ్లపల్లి గురుకుల స్కూలు విద్యార్థినుల కష్టాలు కలచివేస్తున్నాయి. 5ఏళ్లుగా అక్కడే తిష్ట వేసిన PET జోత్స్న మానసికంగా, శారీరకంగా తమను వేధిస్తోందని, నెలసరిలోనూ ప్రేయర్కు రావాలంటోందని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రార్థన టైంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారంటూ బాత్రూం తలుపులు పగులగొట్టి ఫోన్లో వీడియో తీసి కర్రతో కొట్టడం భరించలేక రోడ్డెక్కారు. విషయం తెలిసి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు.
Similar News
News January 25, 2026
నెయ్యితో సౌందర్య ప్రాప్తిరస్తు

నెయ్యి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. నెయ్యిలో ఉండే విటమిన్ A, ఫ్యాటీయాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మసౌందర్యాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. నెయ్యిని స్నానం చేసే ముందు చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది మాయిశ్చరైజర్లా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతిమంతం చేయడంతో పాటు ముఖంపై ఉండే ముడతలను కూడా తగ్గిస్తుంది.
News January 25, 2026
IMA డెహ్రాడూన్లో ఉద్యోగాలు

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) డెహ్రాడూన్ 10 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD, NET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indianmilitaryacademy.nic.in/
News January 25, 2026
TNలో హిందీకి స్థానం లేదు: CM స్టాలిన్

రాష్ట్రంలో హిందీ భాషకు ఎప్పుడూ స్థానం లేదని, ఫ్యూచర్లోనూ ఉండబోదని TN CM స్టాలిన్ చెప్పారు. తమిళ భాషను ప్రజలంతా ప్రేమిస్తారని దానిని మరుగుపరిచే చర్యలను ఉపేక్షించబోమన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతిసారీ తమిళులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. 1965లో TNలో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగా నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఈ కామెంట్స్ చేశారు.


