News June 2, 2024
‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

AP: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించే విద్యాకానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వాటిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేశారు. జూన్ 12న స్కూళ్లు తెరిచిన తొలిరోజే వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాకానుక కిట్లో బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్య, నోటు పుస్తకాలు, వర్క్బుక్స్, డిక్షనరీ, యూనిఫామ్ క్లాత్ ఉంటాయి. ఈ ఏడాది 38లక్షల మంది స్టూడెంట్లకు కిట్లను అందించనున్నారు.
Similar News
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


