News May 18, 2024
KU వీసీపై విజిలెన్స్ విచారణ
TG: నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొ.రమేశ్పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పలువురు యూనివర్సిటీ అధ్యాపకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదులను విజిలెన్స్ డీజీకి పంపిన విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. వీలైనంత వేగంగా నివేదిక అందించాలని ఆదేశించారు.
Similar News
News December 22, 2024
AA ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర?: కిషన్ రెడ్డి
TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
News December 22, 2024
ట్రెండింగ్లో #StopCheapPoliticsOnAA
తొక్కిసలాట ఘటనను కారణంగా చూపిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని SMలో ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. కావాలనే AAను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని పోస్టులు చేస్తున్నారు. దిష్టి బొమ్మ దహనం, ఇంటిపై దాడి అందులో భాగమేనని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా బన్నీని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని కోరుతున్నారు. ఈ క్రమంలో #StopCheapPoliticsOnALLUARJUN ను ట్రెండ్ చేస్తున్నారు.
News December 22, 2024
రూ.5,000 కోట్లతో జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నెల 28న తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ను ఆయన వివాహమాడతారు. ఈ వేడుకను రూ.5,000 (600 మిలియన్ల డాలర్లు) కోట్ల ఖర్చుతో కొలరాడోలో గ్రాండ్గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తారని సమాచారం. కాగా బెజోస్ గతంలో మెకంజీ స్కాట్ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.