News June 22, 2024

మధ్యప్రదేశ్‌కు ఆడేందుకు ‘నో’ చెప్పిన విహారి

image

దేశవాళీ మ్యాచుల్లో మధ్యప్రదేశ్ తరఫున ఆడేందుకు భారత క్రికెటర్ హనుమ విహారి నో చెప్పారు. కోచ్ చంద్రకాంత్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి క్యాంపును వీడారు. గతంలో ACAతో వివాదం నెలకొనగా MP తరఫున ఆడాలని విహారి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా తన డెసిషన్‌ను మార్చుకున్నారు. దీనిపై కోచ్ పండిత్ అసహనం వ్యక్తం చేశారు. కాగా విహారి తిరిగి ఆంధ్రా జట్టుతో చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Similar News

News January 31, 2026

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

image

AP: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. అటు వేంకటేశ్వరుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 69,254 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా 20,954 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35కోట్లుగా నమోదైనట్లు TTD తెలిపింది.

News January 31, 2026

ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

image

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News January 31, 2026

Budget: హిస్టరీ క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

image

రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇండియన్ హిస్టరీలో ఒకే ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అవి వేర్వేరు ప్రధానుల కాలంలో జరిగాయి.