News October 26, 2024
‘లక్కీ భాస్కర్’ ఈవెంట్కు గెస్టులుగా విజయ్, త్రివిక్రమ్

హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ దీపావళి సందర్భంగా ఈనెల 31న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మేకర్స్ రేపు ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. దీనికి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్టులుగా వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. HYDలోని JRC కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
Similar News
News November 7, 2025
ఢిల్లీలో 100కి పైగా విమానాల రాకపోకలకు ఆటంకం

ఢిల్లీలో 100కి పైగా విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. IGIA ఎయిర్పోర్ట్ ATCలో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి కారణం. దీని వల్ల ఆన్బోర్డు, టెర్మినల్స్ వద్ద ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వచ్చింది. అత్యధిక విమానాల రాకపోకల్లో ఆలస్యం చర్చకు దారితీసింది. సమస్యను గుర్తించి పరిష్కరించామని, పరిస్థితి క్రమేణా సద్దుమణిగినట్లు ఎయిర్పోర్టు తెలిపింది. ఉత్తరాది ఎయిర్పోర్టులపైనా దీని ప్రభావం పడింది.
News November 7, 2025
e-KYC పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు రద్దు!

AP: e-KYC పూర్తి చేయించుకోని వారి రేషన్ కార్డులను రద్దుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ e-KYC చేయించుకోవాలని, లేదంటే అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో చాలా మంది ఇంకా e-KYC చేయించుకోలేదని, డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇస్తే e-KYC పూర్తయినట్లేనని అధికారులు తెలిపారు.
News November 7, 2025
ఊచకోత.. 6 ఓవర్లలో 148 రన్స్

Hong Kong Sixes 2025 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 6 ఓవర్ల మ్యాచులో ఏకంగా 148/2 చేసింది. కెప్టెన్ గుల్బదిన్ 12 బంతుల్లో 50, జనత్ 11 బంతుల్లో 46 రన్స్ చేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్స్ 400కు పైగానే ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 ఓవర్లలో 99 రన్స్ చేసి 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఇరుజట్ల బ్యాటర్లు కలిపి 25 సిక్సర్లు బాదారు.


