News September 14, 2024
చివరి సినిమాను ప్రకటించిన విజయ్!

తమిళ హీరో విజయ్ తన చివరి సినిమాను ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో 69వ సినిమాను చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్ త్వరలోనే రానున్నట్లు పేర్కొంది. ఈ సినిమాకు KVN ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన ‘ది గోట్’ మూవీ తెలుగులో నిరాశపర్చింది.
Similar News
News December 10, 2025
కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


