News March 1, 2025
డిప్యూటీ సీఎంగా విజయ్? ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ

టీవీకే అధినేత విజయ్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ కీలక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో AIDMKతో పొత్తు ఉంటే బాగుంటుందని తెలిపారు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీగా విజయ్ ఉండాలన్నారు. ఈ ఫార్ములాతోనే APలో ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఏఐడీఎంకేకు 25శాతం ఓటుబ్యాంకు ఉందని, టీవీకేకు 20 శాతం రావచ్చని అంచనా వేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమన్నారు.
Similar News
News March 1, 2025
HIGH ALERT: ఈ ఎండా కాలం అంత ఈజీ కాదు

TG: ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా APR, MAYలో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ, HYD పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంది. 1901-2025 సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ఈ ఏడాదే తీవ్రత అధికమని పేర్కొంది.
News March 1, 2025
గత ఐదేళ్లూ రాష్ట్రంలో నవ్వే లేదు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో నవ్వే లేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ 9 నెలల్లో ఇదే పెద్ద మార్పు అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను రూ.4వేలకు పెంచి ఒకటో తేదీనే ఇస్తున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా GD నెల్లూరులో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోందని వివరించారు.
News March 1, 2025
‘అఖండ-2’: హిమాలయాలకు బోయపాటి!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాలను గుర్తించే పనిలో బోయపాటి ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇంతకుముందు చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలవనున్నట్లు టాక్.