News December 4, 2024

‘పుష్ప-3’లో విలన్‌గా విజయ్ దేవరకొండ?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ వేళ ‘పుష్ప-3’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మూడో భాగంలో మెయిన్ విలన్‌గా VD ఉంటారని, ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ గురించి ఆయన 2022లోనే హింట్ ఇచ్చారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, రేపు ‘పుష్ప-2’ విడుదల కానుంది.

Similar News

News December 10, 2025

సిరిసిల్ల: ఓటు చోరీకి మద్దతుగా 27వేల సంతకాల సేకరణ

image

టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఓటు చోరీ కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలో 27 వేల సంతకాలను సేకరించినట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని నిరూపిస్తూ సేకరించిన సంతకాలను గాంధీభవన్లో అప్పగించామని పేర్కొన్నారు. ఓట్ చోరీ జరిగిన విషయం రాష్ట్రపతి వరకు చేరవేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు.

News December 10, 2025

AP న్యూస్ రౌండప్

image

*58,204మంది అంగన్వాడీ వర్కర్లకు 5G ఫోన్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
*ఉచిత సివిల్స్ కోచింగ్‌కు మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 100మంది ఎంపిక: మంత్రి సవిత
*రైతుల నుంచి MSPకి కొన్న ప్రతి గింజను వేగంగా రైళ్లలో FCI గోదాములకు తరలిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్(తెలుగు)- 2A పరీక్షకు 2 సెషన్స్‌లో కలిపి 17,181మంది అభ్యర్థులు హాజరు

News December 10, 2025

రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM

image

AP: ఆధునిక సాగు యంత్రాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వాణిజ్య పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. ‘శాస్త్రీయ విధానంలో సాగు ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గించాలి. ఓ వెబ్‌సైట్ ప్రారంభించి పరికరాల వివరాలు తెలియజేయాలి. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్‌లోని సమస్యలను CCI అధికారులు పరిష్కరించాలి’ అని ఆదేశించారు.