News November 28, 2024
బన్నీకి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ‘రౌడీ పుష్ప’ అని రాసి ఉన్న టీషర్టులను ఆయన బహుమతిగా ఇచ్చారు. ఇవి అందిన వెంటనే ఆయన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పారు. కాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా పేరును విజయ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఐకాన్ స్టార్‌కు పంపారు.
Similar News
News January 21, 2026
నెల్లూరు: అసలు దొంగలు ఎవరు..?

ఉదయగిరిలో పట్టుబడిన <<18909764>>ఎర్ర చందనం <<>>వెనుక అసలు పాత్రదారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా ఉంది. అటవీ సిబ్బంది, పోలీసులకు తెలియకుండా భైరవకోన కొండ ప్రాంతం నుంచి ఉదయగిరి అర్లపడియ వైపు ఎర్రచందనం ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. అక్కడ గ్రామస్థులు అడ్డుకోకపోయి ఉంటే సరిహద్దులు దాటి వెళ్లిపోయేది. నిఘాపెట్టాల్సిన పోలీసులు, అటవీ రేంజ్ సిబ్బందికి తెలియకుండానే ఇది జరిగి ఉంటుందా? అని స్థానికులు అనుమానిస్తున్నారు.
News January 21, 2026
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News January 21, 2026
రూ. లక్ష జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

<


