News December 14, 2024

‘పుష్ప-3’లో విజయ్ దేవరకొండ.. రష్మిక రియాక్షన్ ఇదే

image

‘పుష్ప-2’కు కొనసాగింపుగా ‘పుష్ప-3’ రానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తనకు ఆ విషయమై ఎలాంటి సమాచారం లేదని స్పష్టతనిచ్చారు. తాను కూడా ఆ ప్రచారాన్ని చూసినట్లు పేర్కొన్నారు. అయితే సస్పెన్స్ ఇవ్వడం సుకుమార్‌కు చాలా ఇష్టమన్నారు.

Similar News

News November 25, 2025

సత్తమ్మ LPG సబ్సిడీ కూడా రాజన్న అకౌంట్లోనే..!

image

వేములవాడకు చెందిన మహిళా రైతు ఏదుల సత్తమ్మ వంట గ్యాస్ సబ్సిడీ కొంతకాలంగా రాజన్న ఆలయ ఖాతాలోనే పడుతోంది. సత్తమ్మ పత్తి విక్రయించిన సొమ్ము ఆమె సొంత ఖాతాలో కాకుండా ఆలయ ఖాతాలో జమ కాగా, ఆమె ఆధార్ నంబర్‌తో రాజన్న ఆలయ బ్యాంకు ఖాతా పొరపాటున అనుసంధానం కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు. పొరపాటుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News November 25, 2025

చైనా ఎఫ్‌డీఐలపై ఆంక్షల సడలింపునకు కేంద్రం యోచన

image

చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)పై పెట్టిన ఆంక్షలను కాస్త సడలించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల విషయంలో అనుసరిస్తున్న కఠిన నిబంధనలను సడలించాలని అనుకుంటున్నట్టు సమాచారం. కేంద్ర క్యాబినెట్ పరిశీలనకు అధికారులు ఒక నోట్ రెడీ చేశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2020లో గల్వాన్ బార్డర్ ఘర్షణ తర్వాత చైనా ఎఫ్‌డీఐలపై ఆంక్షలు విధించింది.

News November 25, 2025

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడి మరో 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని.. 30వ తేదీన ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.