News October 7, 2025
విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని పసలేని కామెంట్స్!

సినీ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరగడానికి రష్మికే కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంగేజ్‌మెంట్ జరిగిన రెండు రోజులకే ప్రమాదం జరిగిందని, రష్మికది ఐరన్ లెగ్ అని అంటున్నారు. కాగా అవి పసలేని వాదనలంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విజయ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటానికి రష్మికే కారణమని పాజిటివ్‌గా థింక్ చేయొచ్చుగా అని సలహాలిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 7, 2025
నార్త్ వెస్టర్న్ రైల్వేలో 2,094 పోస్టులు

నార్త్ వెస్టర్న్ రైల్వే 2,094 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. జైపుర్‌లోని RRC ఈ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థుల వయసు 15నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.
News October 7, 2025
ఈ చిన్నారుల మరణానికి కారణమెవరు?

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయిన కేసులో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. తయారీ కంపెనీకి విచ్చలవిడిగా అనుమతులిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడుకు చెందిన సిరప్ కంపెనీ ‘శ్రీసన్’ నిబంధనలు పాటించలేదని తేలింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా ఉండటానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. తరచూ తనిఖీలు చేస్తే ఇలా జరిగేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
News October 7, 2025
బ్లాక్ సర్కిల్స్ ఇలా తగ్గిద్దాం..

కంప్యూటర్లు, ఫోన్ ఎక్కువగా చూడటం, వేళకు నిద్రపోకపోవడం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటిచారలు వస్తాయి. వీటిని కొన్ని ఇంటిచిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంప రసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K బ్లాక్‌సర్కిల్స్‌ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్లచుట్టూ రాసి మర్దన చేయాలి. <<-se>>#BeautyTips<<>>