News February 19, 2025
బాలీవుడ్ డైరెక్టర్తో విజయ్ దేవరకొండ మూవీ?

యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’తో దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. ఈ డైరెక్టర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో కథను రెడీ చేశారని సమాచారం. విజయ్ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘కింగ్డమ్’లో నటిస్తున్న విజయ్ ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్తోనూ సినిమాకు ఒకే చెప్పారు.
Similar News
News November 10, 2025
వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి వాటికి తగ్గ ట్రీట్మెంట్ చేయాలి.
News November 10, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

IAFలో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AFCAT)-2026 <
News November 10, 2025
19న మహిళలకు చీరల పంపిణీ

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.


