News August 20, 2024

‘విజయ్’ డబుల్ యాక్షన్?

image

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌తో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. ఇందులో ఓ పాత్రలో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారని చర్చ నడుస్తోంది. కాగా ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తారని టాక్. ఈ మూవీ అక్టోబర్/నవంబర్‌లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 28, 2025

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.

తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

image

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.