News December 21, 2024
నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ

విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. HYD, VZMతో పాటు మొత్తం 7 నగరాల్లో ఈ మ్యాచులు జరగనుండగా, 38 జట్లు పోటీ పడనున్నాయి. జనవరి 5తో గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగియనుండగా, JAN 9 నుంచి నాకౌట్ మ్యాచులు నిర్వహిస్తారు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్, రుతురాజ్, ఇషాన్ కిషన్, అర్ష్దీప్, అభిషేక్ శర్మ తదితరులు పాల్గొంటారు. ఆంధ్ర కెప్టెన్గా KS భరత్, HYD కెప్టెన్గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు.
Similar News
News November 28, 2025
VKB: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల పరిధిలోని బండపల్లి గ్రామానికి చెందిన గుండెపల్లి రవి 2016లో గర్భవతిగా ఉన్న తన భార్య సుజాతకు గొడ్డలితో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పత్రాలు, సాక్షాలను కోర్టుకు సమర్పించారు. శుక్రవారం వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
News November 28, 2025
డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.
News November 28, 2025
వాషింగ్ మెషీన్.. ఈ జాగ్రత్తలు తెలుసా?

నిన్న HYDలో వాషింగ్ మెషీన్ <<18404735>>పేలడంతో<<>> చాలా మంది భయపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. *రెగ్యులర్గా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్ చేయించాలి *టూల్స్ మార్చాల్సి వస్తే బ్రాండెడ్వే వాడాలి *ఎక్కువ లోడ్ (దుస్తులు) వేయొద్దు. దీన్ని వల్ల ఒత్తిడి పెరుగుతుంది *ఏదైనా పెద్ద శబ్దం, వాసన వస్తే వెంటనే ప్లగ్ తీసి టెక్నీషియన్ను పిలవాలి.


