News July 8, 2024

OTTలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి సినిమా

image

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Similar News

News January 25, 2026

సూర్యుడు దేవుడా..?

image

కాలం అత్యంత శక్తిమంతమైనది. అది సృష్టిని నిర్మిస్తుంది. తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ కాలం కంటికి కనబడదు. అలాంటి కాలాన్ని కొలిచే ప్రమాణమే సూర్యుడు. ఆయన వేసే ప్రతి అడుగు కాలానికి కొలమానం వంటిది. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, రోజులు, నెలలు అన్నీ సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే కంటికి కనిపించని దైవానికి, కంటికి కనిపించే రూపమే సూర్యుడని నమ్ముతాం. ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం.

News January 25, 2026

కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

image

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.

News January 25, 2026

షోరూమ్‌లలో వెహికల్ రిజిస్ట్రేషన్ వాటికి మాత్రమే!

image

TG: వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా షోరూమ్‌ల వద్దే వెహికల్స్ <<18940796>>రిజిస్ట్రేషన్<<>> జరిగేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైవేట్ టూ వీలర్లు, కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ వాహనాలకు వర్తించదు. ఆ వాహనాలకు పాత పద్ధతిలో ఆర్టీఏ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.