News December 18, 2024

పాత్రలు నిరాకరిస్తున్న విజయ్ సేతుపతి?

image

పాత్ర నచ్చితే ఆలోచించకుండా అంగీకరించే విజయ్ సేతుపతి ఇప్పుడు ఆచితూచి రోల్స్ ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు తెరకెక్కించే మూవీలో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ సంప్రదించగా ఆయన నో చెప్పిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలోనూ ఆయన మంచి పాత్ర చేశారు. ఇకపై హీరో పాత్రలే చేయాలని సేతుపతి భావిస్తున్నారని, అందుకే చాలా రోల్స్ రిజెక్ట్ చేశారని సమాచారం.

Similar News

News November 25, 2025

డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్వేలో 5,810 NTPC పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. సికింద్రాబాద్ రీజియన్‌లో 396 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు రూ.250 చెల్లించాలి. *మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 25, 2025

NHAIలో 84 పోస్టులు.. అప్లై చేశారా?

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 84 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు DEC 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, B.L.Sc, MA, డిగ్రీ, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్, అకౌంటెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు కాగా.. స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: nhai.gov.in

News November 25, 2025

హీరో అజిత్‌కు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

image

సినిమాల్లో నటిస్తూనే ప్రొఫెషనల్ కార్ రేసర్‌గానూ హీరో అజిత్ రాణిస్తున్నారు. కార్ రేసింగ్ ఇండస్ట్రీలో సాధించిన విజయాలు, ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ ట్రాక్‌లో ఇండియా ప్రతిష్ఠను పెంచినందుకు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారాన్ని ఫిలిప్ చారియోల్ మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ అందజేసింది. ఇటలీలో జరిగిన కార్యక్రమంలో అజిత్‌కు SRO మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ సీఈవో స్టెఫాన్ రాటెల్ అవార్డు అందజేశారు.