News April 1, 2025
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు

AP: నేటి నుంచి విజయ, సంగం పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ఆయా డెయిరీలు తెలిపాయి. పాల ఉత్పత్తి తగ్గడం, ప్యాకింగ్, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. విజయ గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటర్ రూ.74 ఉండగా రూ.76 కానుంది. అలాగే టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్ (900 గ్రాములు) రూ.62 నుంచి రూ.64కు పెరగనుంది. నెలవారీ పాలకార్డు ఉన్న వారికి ఈ నెల 8 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపింది.
Similar News
News November 14, 2025
SAvsIND: ఈ‘డెన్’ మనదేనా?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈడెన్‌లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది. 9.30AMకు మ్యాచ్ మొదలుకానుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
News November 14, 2025
బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్ ఓటమి కూడా ఈసారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.


