News January 26, 2025
విజయ ‘తిలకం’ దిద్దాడు

దాదాపు చేజారిందనుకున్న మ్యాచ్‌లో నిన్న ఇంగ్లండ్‌పై తెలుగు కుర్రాడు తిలక్ వర్మ <<15261334>>అదరగొట్టారు<<>>. మిగతావారు ఔట్ అవుతున్నా ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. తప్పుడు షాట్లు ఆడలేదు. ఈక్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తయినా సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే అతడి దృష్టంతా మ్యాచ్ గెలిపించడంపైనే. చివరికి మరో 4 బంతులు ఉండగానే భారత్ నుదుటిపై విజయ తిలకం దిద్ది, అప్పుడు గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకున్నారు. * HATS OFF TILAK
Similar News
News January 9, 2026
కోటబొమ్మాళికి డిగ్రీ కాలేజీ మంజూరు..జిల్లాలో మొత్తం ఎన్నంటే?

శ్రీకాకుళం జిల్లాకు విద్యాశాఖ కోటబొమ్మాళిలో నూతనంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్), శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, టెక్కలి, పలాస, బారువ, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, తొగరాం, పొందూరు ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. కొత్తది మంజూరు కావడంతో జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 13కు చేరుకున్నాయి.
News January 9, 2026
PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.
News January 9, 2026
IIT ఇండోర్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


