News November 19, 2024

విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

image

AP: పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయించింది. 10% వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 10% వెన్న కలిగిన పాలకు రూ.80 చెల్లిస్తుండగా, రూ.2 పెంచడంతో రూ.82కి చేరింది. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెండో విడత బోనస్‌గా రూ.12కోట్లను నేడు విడుదల చేయనుంది.

Similar News

News October 23, 2025

HEADLINES

image

* దుబాయ్‌లో కొనసాగుతున్న AP CM చంద్రబాబు పర్యటన
* రేపే TG క్యాబినెట్.. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
* అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం
* మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆగేదాకా ఉద్యమం ఆపబోం: సజ్జల
* మోదీ పిరికి ప్రధాని: కాంగ్రెస్
* APలో అతిభారీ వర్షాలు.. 4 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు

News October 23, 2025

కోహ్లీ ఎదుట అరుదైన రికార్డ్

image

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా రేపు టీమ్ ఇండియా రెండో వన్డే ఆడనుంది. విరాట్ మరో 25 రన్స్ చేస్తే ఈ వేదికగా 1000 ఇంటర్నేషనల్ రన్స్ పూర్తి చేసుకున్న తొలి విదేశీ ఆటగాడు అవుతారు. అడిలైడ్‌లో 6 వన్డేల్లో ధోనీ 262 రన్స్ చేశారు. కోహ్లీ మరో 19 పరుగులు చేస్తే MSD రికార్డునూ బద్దలు కొడతారు. ఇక్కడ 4 వన్డేలాడి కోహ్లీ 244 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లోనైనా విరాట్, రోహిత్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 23, 2025

రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం మునీర్‌కు ఇష్టం లేదు: ఇమ్రాన్ ఖాన్

image

సైనిక బలంతో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడని PAK ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై ఆ దేశ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. చట్టబద్ధ పాలన, న్యాయం, రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం ఆయనకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు లేకుండా ఏ దేశమూ బలోపేతం కాదని చెప్పారు. తనను జైల్లో ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. AFGతో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.