News April 4, 2025
విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ

TG: పాల సేకరణ ధరల్లో విజయ డెయిరీ సవరణ చేసింది. 7% వెన్న ఉన్న గేదె పాల ధరను లీటర్‌కు రూ.56 నుంచి రూ.59.50కు, 10% వెన్న ఉంటే రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. 3% వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటి వరకు లీటర్‌కు రూ.40 ఉండగా రూ.36.50కు తగ్గించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. గేదె పాలు విక్రయించే రైతులకు లబ్ధి చేకూరనుండగా, ఆవు పాలు అమ్మే వారికి కాస్త నష్టం కలగనుంది.
Similar News
News April 11, 2025
నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక <<16045416>>నిఖిత(17)<<>> అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే నిఖితకు అంత్యక్రియలు జరిపారు. వేరే కులానికి చెందిన అజయ్ అనే యువకుడిని నిఖిత ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇది తెలిసి పేరెంట్స్ ఆమెను మందలించి, అబార్షన్ చేయించారు.
News April 11, 2025
స్టాక్ మార్కెట్లకు 2 రోజులు సెలవులు

వచ్చేవారం స్టాక్ మార్కెట్లు మూడు రోజులే నడవనున్నాయి. రెండు రోజులు సెలవులు ఉంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు తెరుచుకోవు. మంగళ, బుధ, గురువారం వర్కింగ్ డేస్ కాగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం హాలిడే ఉండనుంది. శని, ఆదివారం యథావిధిగా వారాంతపు సెలవులు కొనసాగనున్నాయి. కాగా ఇవాళ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన <<16065141>>విషయం<<>> తెలిసిందే.
News April 11, 2025
GREAT: సో‘హిట్’ కావాలి

MPలోని జబల్పూర్‌కు చెందిన 11ఏళ్ల ఆర్చర్ సోహిత్ కుమార్ అండర్-15 జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో 720 పాయింట్లకు 710 పాయింట్లు సాధించి నేషనల్ రికార్డు సృష్టించారు. ఆయన తండ్రికి ఓ కాలు లేదు. చేతికర్రలు, తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాలను అధిగమిస్తుంటే, ఆ కష్టానికి ప్రతిఫలంగా సోహిత్ ఆర్చరీలో రికార్డులు నెలకొల్పుతున్నారు. 2028ఒలింపిక్స్ లక్ష్యం అంటున్నారు.