News April 9, 2024

హసరంగ స్థానంలో విజయకాంత్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ హసరంగ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన స్థానంలో శ్రీలంక స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ జట్టులో చేరుతున్నట్లు SRH మేనేజ్మెంట్ ప్రకటించింది.

Similar News

News February 4, 2026

BRS ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి: రేవంత్

image

TG: పార్టీ టికెట్ ఒక్కరికే వస్తుందని, అందరూ ఐక్యంగా విజయానికి పనిచేయాలని CM రేవంత్ మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతలకు సూచించారు. అభ్యర్థులు అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. ‘ప్రతి ఓటూ ముఖ్యమే. ఇంటింటికీ తిరిగి ఓట్లడగాలి. ఈ ఎన్నికల్లో BRS ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి’ అని సూచించారు. మాజీ MLA భాస్కర్ రావు నమ్మకద్రోహి అని విమర్శించారు. గెలుస్తామన్న నమ్మకంతో ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించానని వివరించారు.

News February 4, 2026

APR 30న రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్: బుచ్చిబాబు

image

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. మార్చి 27న రావాల్సిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు బుచ్చిబాబు X వేదికగా ప్రకటించారు. షూటింగ్ పూర్తికాకపోవడంతో పాటు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 4, 2026

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

image

AP: చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. గుంటూరులోని అంబటి ఇల్లు, ఆఫీసును పరిశీలించారు. అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.