News June 6, 2024
ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్?

APకి కొత్త సీఎస్‌గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం APSPDCL ఛైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్‌ను CSగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగానూ ఆయన వ్యవహరించారు.
Similar News
News November 28, 2025
భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిన ఘటన భువనగిరి మండల పరిధిలో జరిగింది. కుమ్మరిగూడెంకు చెందిన లక్ష్మయ్య అనే రైతు పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 28, 2025
స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.


