News December 29, 2024

ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?

image

AP: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.

Similar News

News December 29, 2024

ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదులు హతం

image

JKలో ఈ ఏడాది 75 మంది ఉగ్ర‌వాదుల్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎన్‌కౌంట‌ర్ చేశాయి. వీరిలో 60% మంది పాక్ ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్టు ఆర్మీ వెల్ల‌డించింది. ఈ ప్రాంతంలో కేవలం న‌లుగురు స్థానికుల్ని రిక్రూట్ చేయ‌డం ద్వారా భార‌త్‌పై బ‌య‌టిశ‌క్తుల్ని ఎగదోయడంలో పాక్ పాత్ర స్పష్టమవుతోంది. హ‌త‌మైన 75 మంది ఉగ్ర‌వాదుల్లో మెజారిటీ విదేశీయులే ఉన్నారు. కొంద‌రు LOC వద్ద చొర‌బ‌డేందుకు య‌త్నించ‌గా ఆర్మీ ఎన్‌కౌంట‌ర్ చేసింది.

News December 29, 2024

విద్యార్థులకు శుభవార్త

image

AP: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. ₹206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

News December 29, 2024

జనవరి 5న ‘డాకు మహారాజ్’ థర్డ్ సింగిల్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. జనవరి 5న ఈ మూవీ థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశీ రౌతేలా కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.