News March 12, 2025
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు రావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని VSRపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Similar News
News March 12, 2025
తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: సీఎం

AP: ‘తల్లికి వందనం’ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తుచేశారు. ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు.
News March 12, 2025
ముగ్గురు IPSల సస్పెన్షన్ పొడిగింపు

AP: ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు IPSల సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాంతిరాణా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీలపై సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25 వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి.
News March 12, 2025
4 నెలల్లో ₹86లక్షల కోట్లు ఆవిరి.. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన భారత వాటా

నిఫ్టీ, సెన్సెక్స్ క్రాష్‌తో గత 4 నెలల్లోనే రూ.86లక్షల కోట్ల ($1T) మార్కెట్ విలువ నష్టపోయిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు పేర్కొంది. దీంతో ప్రపంచ మార్కెట్ విలువలో భారత వాటా తగ్గిపోయింది. 20 రోజుల సగటు లెక్కింపు ప్రకారం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లో గత ఏడాది 4% ఉన్న ఈ విలువ ఇప్పుడు 3%కు పడిపోయింది. సాధారణంగా సంక్షోభం తర్వాత 70 రోజుల్లో రికవరీ బాట పట్టే సూచీలు అనిశ్చితితో వరుసగా 5 నెలలు నష్టాల్లో ముగిశాయి.