News January 24, 2025

విజయసాయి రెడ్డి.. ఇది ధర్మమా?: బండ్ల గణేశ్

image

రాజకీయాల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుకోవడంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. ‘అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. ఇది ధర్మమా!’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 9, 2025

నేడు ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనున్న సీఎం

image

TG: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 నుంచి ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. అటు గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఇవాళ రాత్రి డ్రోన్ ప్రదర్శన చేయనున్నారు. నిన్న భారీ ఎత్తున పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా ఇవాళ మరిన్ని కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది.

News December 9, 2025

గొర్రెలను కొంటున్నారా? ఈ లక్షణాలుంటే మంద వేగంగా పెరుగుతుంది

image

గొర్రెలను కొనేటప్పుడు ఆడ గొర్రెల వయసు ఏడాదిన్నర, 8-10kgల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10-15kgల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు, ఆడ గొర్రెల్లో ఎలాంటి లక్షణాలుంటే మంద వేగంగా పెరుగుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 9, 2025

రేపటి నుంచి వారికి సోషల్ మీడియా నిషేధం

image

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు రేపటి నుంచి SMపై నిషేధం అమలులోకి రానుంది. Insta, Facebook, Tiktok, X, Youtube, Snapchat వంటి ప్లాట్‌ఫాంలు ఈ జాబితాలో ఉన్నాయి. నిషేధానికి ముందు తమ ఫొటోలు, కాంటాక్టులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని సంస్థలకు భారీ జరిమానా విధించనున్నారు. మెంటల్ హెల్త్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ నివారణ కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం తెలిపింది.