News December 8, 2024
విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు: బుద్దా వెంకన్న

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత <<14819228>>బుద్దా వెంకన్న<<>> పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ సీపీ రాజశేఖర్బాబుకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే VSRను అరెస్టు చేయాలని కోరారు. కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.
Similar News
News November 15, 2025
మట్టితో ముఖానికి మెరుపు

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు ముఖాన్ని మెరిపించడంతో పాటు యాక్నే, ముడతలు తగ్గించే క్లే మాస్కులు వాడుతున్నారు. వాటిల్లో ఒకటే కాలిన్ క్లే. దీన్ని వైట్ క్లే, చైనా క్లే అని కూడా పిలుస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మరంధ్రాల లోపలి నుంచి శుభ్రం చేస్తాయి. సెన్సిటివ్, పొడి చర్మతత్వాలతోపాటు యాక్నే ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు.
News November 15, 2025
శ్రీవారి ఆలయంలో రాముడి విగ్రహం ఉంటుందా?

ఏడుకొండలవాసుడి గర్భాలయంలో పంచబేరాలతో పాటు శ్రీరాముడి విగ్రహం కూడా ఉంటుంది. ఆయన ఆంజనేయ, లక్ష్మణ, సీతా సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. రుక్మిణీ సమేత కృష్ణుడు కూడా కొలువై ఉంటారు. విష్ణుమూర్తి సేనాని అయిన విష్వక్సేనుడు, వాహనమైన గరుత్మంతుడు, పవిత్రమైన సుదర్శన చక్రం (చక్రత్తాళ్వార్) విగ్రహాలను కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఈ మూర్తులన్నీ శ్రీవారి సన్నిధిలో నిత్య కైంకర్యాలు అందుకుంటాయి.
News November 15, 2025
క్రీడా ముచ్చట్లు

* జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్లో సెమీస్ చేరిన భారత షట్లర్ లక్ష్యసేన్
* ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ షూటింగ్ కాంస్యం సాధించిన హైదరాబాదీ ఇషా సింగ్
* జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ జట్టు(40+ AGE)
* కెరీర్లో తొలిసారి రెడ్ కార్డు అందుకున్న పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో.. ఐర్లాండ్ ప్లేయర్ను నెట్టినందుకు రిఫరీ చర్యలు


