News November 14, 2024

రఘురామకు విజయసాయిరెడ్డి విషెస్

image

AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికైన TDP MLA రఘురామకృష్ణరాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్థానం గౌరవాన్ని కాపాడతారనే నమ్మకం ఉందన్నారు. గతం తాలూకూ జ్ఞాపకాలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన RRRకు VSR విషెస్ తెలపడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News November 4, 2025

కార్తీక మాసం: దీపాలెందుకు పెడతారు?

image

శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పాలద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారు.

News November 4, 2025

న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్‌లో 405 పోస్టులు

image

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్(<>NFC<<>>) 405 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.nfc.gov.in/

News November 4, 2025

రబీలో వరికి బదులు ఆరుతడి పంటలతో లాభాలు

image

రబీ కాలంలో వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం 2 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పంట మార్పిడి వల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు తగ్గుతాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది.