News May 4, 2024

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈసారి వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పడంతో చంద్రబాబు గెలుపు అవకాశాలు తగ్గినట్లు రూపొందించిన ఒక మీమ్‌ను ఆయన షేర్ చేశారు. సాధారణంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువు వస్తుందని వైసీపీ తరచూ విమర్శిస్తూ ఉండటం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలా ట్వీట్ చేశారు.

Similar News

News March 16, 2026

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 11.45AMకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్‌ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్‌లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

News March 16, 2026

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 16, 2026

కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచే దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలో 93 KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CETకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3న జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.