News March 12, 2025
జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

AP: మాజీ CM YS జగన్‌పై YCP మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకెళ్తారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టి YCP నుంచి బయటకు వచ్చా. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News April 6, 2026
ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి: సీఎం

AP: అమరావతికి YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో అన్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతి అని పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.
News April 6, 2026
వచ్చే నెలలో మద్యం ధరల పెంపు?

TG: రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 12-15% ధరలు పెంచాలని బ్రూవరీస్ చేసిన ప్రతిపాదనల ఫైల్‌ను రిటైర్డ్ జడ్జితో కూడిన జుడీషియల్ కమిటీకి పంపింది. వారంలో నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని, ధరలు పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో కమిటీ రిపోర్టు ఆధారంగా వచ్చే నెలలో మద్యం ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
News April 6, 2026
గ్యాస్ కొరతపై రాహుల్ ఫైర్

వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కష్టకాలాన్ని మోదీ ప్రభుత్వం ఎలాగైతే గాలికొదిలేసిందో ఇప్పుడు గ్యాస్ సంక్షోభాన్నీ అలాగే హ్యాండిల్ చేస్తోందన్నారు. ప్రకటనలకే పరిమితమవుతూ పేదలను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. రోజూ ₹500-800 సంపాదించే కూలీలకు గ్యాస్ అందనంత దూరమైందన్నారు. దీనివల్ల కార్మికులు నగరాలను వదిలి గ్రామాలకు వెళ్తున్నారని, పరిశ్రమలు నష్టపోతున్నాయన్నారు.


