News January 3, 2025

డబుల్ డెక్కర్‌గా విజయవాడ, వైజాగ్ మెట్రోలు

image

AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లై ఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.

Similar News

News January 5, 2025

మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్: కేటీఆర్

image

TG: రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రూ.12వేలకే పరిమితం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఆయనొక రైతు ద్రోహి అని, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అని మండిపడ్డారు. ‘రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడ్డెక్కి తెడ్డు చూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం.. వరంగల్ డిక్లరేషన్ అబద్ధం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఓ బూటకం’ అని Xలో దుయ్యబట్టారు.

News January 5, 2025

తమిళనాడు సీఎం కావాలన్నదే నా కోరిక: త్రిష

image

రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ఈమె వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పనిచేసిన విషయం తెలిసిందే.

News January 5, 2025

కుంభమేళాకు 13 వేల రైళ్లు

image

Jan 13 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు 13 వేల రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. పుష్కర కాలానికోసారి జరిగే ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మానికి 40 కోట్ల మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. దేశ‌, విదేశాల నుంచి వ‌చ్చేవారి సౌల‌భ్యం కోసం 10K జ‌న‌ర‌ల్ రైళ్లతో పాటు 3K ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌ప‌నున్నారు. కుంభ‌మేళా ప్రారంభానికి ముందు NDRF బృందాలు మాక్‌డ్రిల్ నిర్వ‌హించాయి.