News September 3, 2024

విజయవాడ వరదలు: రూ.కోటి విరాళం

image

AP: విజయవాడలో వరద సహాయక చర్యల కోసం ఎన్నారై, పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. నిన్న సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితుల సమస్యలు తననెంతో కలచివేస్తున్నాయని చెప్పారు. మరోవైపు విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లు విజయలక్ష్మి, నిర్మలాదేవి, రాణి రూ.50వేల చొప్పున రూ.1.50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. వరదలతో బెజవాడ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

Similar News

News October 31, 2025

నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

image

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News October 31, 2025

పాక్-అఫ్గాన్ మధ్య సీజ్‌ఫైర్

image

ఇస్తాంబుల్‌లో ఐదు రోజులుగా పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించింది. దోహాలో OCT 18-19 మధ్య జరిగిన సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తుర్కియే ప్రకటించింది. తదుపరి చర్చలు నవంబర్ 6న జరగనున్నాయి. ‘పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం ఆధారంగా పాక్‌తో ఎప్పుడూ తాము సత్సంబంధాలే కోరుకుంటాం’ అని అఫ్గానిస్థాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.

News October 31, 2025

పిల్లల సాక్సులు శుభ్రం చేస్తున్నారా?

image

పిల్లలు బడికి వెళ్లేటప్పుడు షూ, సాక్స్‌ ధరిస్తుంటారు. కానీ వీటి విషయంలో అశ్రద్ధగా ఉంటే అథ్లెట్స్‌ ఫుట్‌ వస్తుందంటున్నారు నిపుణులు. పాదాలకు పట్టిన చెమటను సాక్స్‌ పీల్చుకుంటాయి. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్‌ ఏర్పడతాయి. వీటిని శుభ్రం చేయకుండా వాడటం వల్ల ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్స్ వస్తే నిర్మూలించటం కష్టం. నెలల కొద్దీ చికిత్స తీసుకోవాలి. కాబట్టి ఉతికి, పూర్తిగా ఎండిన తర్వాతే సాక్సులను వాడాలని సూచిస్తున్నారు.